TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆసియా క‌ప్‌... లంక‌ను చిత్తు చేసిన ఆఫ్ఘ‌నిస్థాన్‌

Published on: Sun Aug 28, 2022 11:05AM

ఆసియాక‌ప్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్ ఊహించని విధంగా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో శ్రీ‌లంకను ఓడిం చింది. శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ 8 వికెట్ల తేడాతో శ్రీ‌లంను చిత్తు చేసిం ది. మొద‌ట బ్యాట్చేసిన లంక  19.4 ఓవర్లలో 105 పరుగు లకే కుప్పకూలింది. రాజపక్సే (38), కరుణరత్నె (31) టాప్‌ స్కోరర్లు. స్వల్ప లక్ష్యాన్ని అఫ్ఘాన్‌ 10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుర్బాజ్‌ (40), హజ్రతుల్లా (37 నాటౌట్‌) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించడంతో.. అఫ్ఘాన్‌ మరో 59 బంతులు మిగిలుండగానే అలవోకగా నెగ్గింది.సియాకప్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. ఆల్‌రౌండర్లతో బలంగా ఉన్న శ్రీలంక జట్టును ఆఫ్ఘని స్థాన్ మట్టి కరిపించింది.  

ఎంతో వ్యూహాత్మ‌కంగా బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌నతో శ్రీలంకను 105 పరుగులకే కట్టిపడేసిన ఆఫ్ఘన్.. ఆ తర్వాత బ్యాటింగులోనూ రెచ్చి పోయి  10.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జాజయ్ 28 బంతు ల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37(నాటౌట్) పరుగులు చేయగా, రహ్మతుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరు గులు చేశా డు. ఇబ్రహీం జద్రాన్ 15, నజీబుల్లా జద్రాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన లంక.. కుశాల్ మెండిస్ (2), అసలంక (0), పాథుమ్ నిశ్శంక (3) విఫలం కావ‌డంతో లంక పీక‌ల్లోంత క‌ష్టాల్లో ప‌డింది. కేవ‌లం 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లంక అభిమానుల‌ను నిరాశ‌ప‌ర‌చింది. ఆఫ్ఘ‌న్ మీద సునాయాస విజ‌యం సాదిస్తుం ద‌న్న ఆశ‌లు ఆడియాస‌లయ్యాయి. చూస్తుండ‌గానే మంచి స్కోర్ చేయ‌గ‌ల లంక బ్యాట‌ర్లు ఒక‌రి వెనుక మ‌రొక‌రు వెనుదిరి గారు. ఈ ప‌రిస్థితిలో  లంకను గుణతిలక (17), బి.రాజపక్స (38) కొంత ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో కుదు రుకున్నా రనుకున్న సమయంలో మరోమారు ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గుణతిలకను అవుట్ చేయడంతో ద్వారా ముజీబ్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటికే బి.రాజపక్స రనౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక మరోమారు కష్టాల్లో కూరుకుపోయింది. 

హసరంగ(2), కెప్టెన్ శనక డకౌట్ కావడంతో ఇక కోలుకోలేకపోయింది. చివర్లో కరుణరత్న 31 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తీక్షణ ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్‌గా వెను దిరగ్గా, మహీశ పథిరన 5, దిల్షాన్ మధు శంక ఒక పరుగు చేశాడు. ఫలితంగా లంక ఇన్నింగ్స్ 19.4 ఓవర్లలో 105 పరుగుల వద్ద ముగిసింది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫజల్లా ఫరూకీ 3 వికెట్లు తీసుకోగా, ముజీబ్, కెప్టెన్ నబీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్-పాక్ జట్లు తలపడతాయి.
శ్రీలంక:19.4 ఓవర్లలో 105 ఆలౌట్‌ (రాజపక్సే 38; ఫారూఖీ 3/11);అఫ్ఘానిస్థాన్‌:10.1 ఓవర్లలో 106/2 (గుర్బాజ్‌ 40, జజాయ్‌ 37 నాటౌట్‌; హసరంగ 1/19).