దేవుడా..బాత్ రూం టిష్యూ పేపర్స్ కూడా దొంగతనం
Published on: Wed Mar 22, 2017 11:26AM
.jpg)
ఆఖరికి బాత్ రూంలో ఉన్నటిష్యూ పేపర్ ని దొంగతనం చేసే పరిస్థితికి వచ్చారు చైనీయులు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అసలు కథ ఏంటంటే.. చైనాలోని ‘టెంపుల్ ఆఫ్ హెవెన్’ అనే ఒక పర్యాటక ప్రాంతం ఉంది. అక్కడ పర్యాటకుల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే వచ్చిపడింది. టాయిలెట్స్‌ను ఉపయోగించుకుంటున్న పర్యాటకులు స్థానికులు టాయిలెట్స్‌లో టిష్యూ పేపర్‌ని పెద్ద మొత్తంలో దొంగలించి పట్టుకుపోతున్నారట. దీంతో నిర్వాహకులు షాకయ్యారంట. అయితే రోజు రోజుకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైందట. దీంతో వారు ఓ ఉపాయం పన్నారు. టాయిలెట్స్‌లోని పేపర్ రోలింగ్ మెషిన్స్‌కు ఫెషియల్ స్కానర్స్‌ని ఏర్పాటు చేశారు. స్వల్ప కాలంలో ఒకే వ్యక్తి రెండు సార్లు టిష్యూ పేపర్‌ను తీయడానికి ప్రయత్నిస్తే ఈ స్కానర్ వ్యక్తిని గుర్తిస్తుందంట. దీంతో ఎంత ప్రయత్నించినా టిష్యూ పేపర్ బయటకు రాదట. దీనిని ఏర్పాటు చేసిన తర్వాత ఫలితం బాగానే కనిపించిందని టెంపుల్ ఆఫ్ హెవెన్ నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి ‘ఫ్రీగా వస్తే... పినాయిల్ తాగేస్తారు’ అన్న సామెతను చైనీయులు బాగా సార్థకం చేశారు.


