వెనకడుగే లేదు : అశోక్‌బాబు

 

సీమాంద్రలో నిరసనలతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఉద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. ఈ నెల 20 తేది వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ మేరకు ఏపిఎన్జీవొ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆదివారం మీడియాకు వివరించారు.

 

సోమవారం ప్రభుత్వంతో జరగనున్న చర్చలకు తాము వెళ్లటం లేదని ప్రకటించారు. ఇక కింది స్థాయి వారితో చర్చలతో ఉపయోగం లేదన్న ఆయన ముఖ్యమంత్రి స్థాయి వారితో మాత్రమే చర్చలు వెలతామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రా కోసం విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా దసరా పండుగను జరుపుకోమని అశోక్‌బాబు తెలిపారు.

 

20వ తారీఖు వరకు ప్రకటించిన కార్యచరణలో భాగంగా 8,9 తేదీల్లో బ్యాంకులు మూసివేత, 10 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశాలు. 1513 జిల్లాల్లోని మండల స్థాయిలో అన్ని మండలాల్లో రైతుల కోసం ప్రత్యేక సదస్సులు. 17 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం చేస్తామని చెప్పారు. అయితే 13, 14తేదిలతో పాటు, 16 తేదిన పండుగల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఉండవని ప్రకటించారు.