రాజీనామాలు వెనక్కి తీసుకొండి ; అశోక్‌బాబు
Published on: Fri Sep 27, 2013 9:34AM

ఇన్నాళ్లు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని పట్టుపట్టిన అశోక్‌బాబు ఇప్పుడు మాట మార్చారు. ఎమ్మెల్యేలు రాజీనామలు చేయాల్సిన అవసరం లేదన్న ఆయన ఇప్పటికే రాజీనామ చేసిన వారిని కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరారు. అంతేకాదు ఈ విషయంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు లేఖ రాయనున్నట్టుగా ఆయన తెలిపారు.
ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్న అశోక్ బాబు ఎంపిలను మాత్రం రాజీనామ చేయమంటున్నారు. అసెంబ్లీలో రాష్ట్రవిభజన తీర్మానాన్ని వ్యతిరేకించటానికి ఇక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండలాని, అలాగే కేంద్రంలో బిల్లు వీగిపోవాలంటే అక్క బలం ఉండకూడదని అందుకే రాష్ట్ర నాయకులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అశోక్‌బాబు వివరించారు.
ఇప్పటికే దాదాపు 60 రోజులుగా ఉద్యమం ఉదృతంగా జరగుతున్న కేంద్రంలో చలనం లేదని కాబట్టి నాయకులు పార్టీల మీద వత్తిడి తీసుకొచ్చి సమైక్యా రాష్ట్రం కోనసాగేలా నాయకులు కృషి చేయాలని కోరారు.


