ఆశారాం బాపు అరెస్ట్‌

 

లైంగిక దాడి ఆరోప‌ణలు ఎదుర్కొంటున్నా ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును పోలీసులు అరెస్ట్ చేవారు. ఇండోర్‌లోని త‌న ఆశ్రమంలో ఉన్న ఆయ‌న‌ను శ‌నివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆయ‌న్ను ఢిల్లీ త‌రలించేదుకు జోధ్‌పూర్ పోలీసుల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అరెస్ట్‌కు ముందు ఆశారాం ఆశ్రయం ముందు హైడ్రామా న‌డిచింది.

జోద్‌పూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక పై ఆశారాం లైంగిక దాడికి దిగిన‌ట్టు ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌టంతో పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ చేప‌ట్టారు. ఆ బాలిక‌కు వైధ్య ప‌రీక్షలు నిర్వహించిన వైధ్యులు లైంగిక దాడి జ‌రిగింద‌ని నిర్ధారించ‌డంతో ఆమె ఫిర్యాదు మేర‌కు ఆశారాం పై కేసు న‌మోదు చేసి అరెస్ట్‌కు రంగం సిద్దం చేశారు.

ఆయ‌న అరెస్ట్ కు వ‌చ్చిన పోలీసుల‌తో ఆశారాం ఇండోర్లో చికిత్స పొందుతున్నారంటూ ఆయ‌న కుమారుడు నారాయ‌ణ్ ప్రేమ్ సాయి చెప్పారు. అరెస్ట్  త‌రువాత ఆయ‌న‌కు వైధ్య ప‌రీక్షలు చేయించిన పోలీసులు ఎలాంటి అనారోగ్యం లేద‌ని తేల్చారు. ఈస‌మ‌యంలో ఆశ్రామానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల‌పై కూడా ఆశ్రమం నిర్వహాకులు దాడికి దిగారు.