ఆశారాం బాపు తనయుడు అరెస్ట్
Published on: Wed Dec 4, 2013 11:11AM

అత్యాచారం కేసులో ఆశారాం బాపు తనయుడు నారాయణ్ సాయిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ్ సాయిని ఢిల్లీ హర్యానా సరిహద్దులో అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.గత 58 రోజులుగా అతను పరారీలో ఉన్నాడు. సూరత్‌లో లైంగిక దాడి కేసులో నారాయణ సాయి నిందితుడు.
నారాయణ సాయిని పట్టిచ్చినవారికి ఐదు లక్షల రివార్డు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో నారాయణ సాయి జైపూర్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆగ్రా వెళ్లాడు. మర్నాడు ఢిల్లీ వచ్చాడు. ఆ సమయంలో అతను సీతాపూర్‌లోని నైమిషారణంలో ఉన్నాడు. అతను తన వేషాన్ని మార్చుకుంటూ వివిధ ప్రాంతాల్లో దాక్కుంటూ పోలీసులకు దొరక్కకుండా తప్పించుకుని తిరిగాడు.


