‘నేను భారత్ మాతాకీ జై అనను’- అసదుద్దీన్
Published on: Mon Mar 14, 2016 5:40PM
.jpg)
ఈ నెల మూడో తేదీన ఆరెస్సెస్ ముఖ్యులు మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘జన్మభూమికి అనుకూలమైన నినాదాలను చేసేలా ఇప్పటి యువతను తీర్చిదిద్దాలని’ సూచించారు. జేఎన్‌యూలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించిన నేపథ్యంలో మోహన్ భగవత్ ఈ సూచన చేశారు. అయితే దానికి ప్రతిస్పందనగా అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ ఓ సంచలన వ్యాఖ్యని చేశారు. ‘నేను భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని చేయను. ఏం చేస్తారు భగవత్‌గారూ!’ అంటూ ప్రశ్నించారు అసదుద్దీన్. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో పర్యటిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ‘తన పీక మీద కత్తి పెట్టినా కూడా ఇలాంటి నినాదాలను చేయననీ, అలా నినదించాలని మన రాజ్యాంగంలో ఎక్కడా లేదని’ తేల్చిచెప్పేశారు. అంతేకాదు! గుజరాత్‌లోని ఒక ఎన్‌కౌంటర్‌లో మరణించిన తీవ్రవాది ఇస్రత్ జహాన్ కుటుంబానికి తమ పార్టీ సాయం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు.


