రాయ‌ల తెలంగాణ అయితే ఓకె

 

తెలంగాణ అంశం తెర మీద‌కు వ‌చ్చిన ద‌గ్గర నుంచి స‌మైక్య గానం బ‌లంగా వినిపిస్తున్న ఎం ఐ ఎం పార్టీ నాయ‌కులు ఇప్పుడు కాస్త మెత్తబడ్డట్టుగా క‌నిపిస్తున్నారు. ఇన్నాళ్లు స‌మైక్యాంద్ర త‌ప్ప మ‌రో ఆఫ‌న్ష్ లేద‌న్న ఆ పార్టీ నాయ‌కులు ఇప్పుడు రాయ‌ల తెలంగాణకు కూడా మ‌ద్దతిస్తామంటున్నారు.

విభ‌జ‌న ప్రక‌ట‌న‌, సీమాంద్రలో నిర‌స‌నల నేప‌ధ్యంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ బుధవారం సాయంత్రం భేటి అయ్యారు. విభ‌జ‌న అనివార్యం అయిన ప‌క్షంలో రాయ‌ల తెలంగాణ‌కు మ‌ద్దతిస్తామ‌న్నారు. ఇన్నాళ్లు స‌మైక్యం వైపు ఉన్న అస‌ద్ ఇప్పుడు రాయ‌ల తెలంగాణ అన‌టంతో ఢిల్లీలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి.

చ‌ర్చ అంతా హైద‌రాబాద్ చుట్టూ న‌డుస్తుండ‌టంతో, హైద‌రాబాద్‌లో బ‌ల‌మైన‌ప‌ట్టు ఉన్న అస‌దుద్దీన్, సోనియాతో భేటి కావ‌టం ప్రాదాన్యం సంత‌రించుకుంది. ఈ భూటిలోనే అస‌ద్ త‌న అభిప్రాయాన్ని సోనియాకు చెప్పారు. అయితే తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తుండ‌టంతో రాయల తెలంగాణ అంశం మళ్లీ కొత్త వివాదాల‌ను తెర మీద‌కు తీసుకువ‌స్తుంది