సామాన్యుడికి సెక్యూరిటీ ఎందుకు?
Published on: Tue Dec 24, 2013 11:50AM
.jpg)
అమ్ ఆద్మీ అధ్యక్షుడు ప్రస్తుతానికి తానూ చేతల మనిషిననే నిరూపించుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే దీన్ని కేజ్రీవాల్ తిరస్కరించారు. తాను సామాన్యుడినేనని, తనకు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో సగటు మనిషి తన రక్షణ గురించి అడిగితె అన్నట్టుగానే ఆయన కూడా తనకు 'దేవుడే రక్ష' అని కూడా అన్నారు.


