TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'జెడ్' కేటగిరీ భద్రత వద్దు: కేజ్రీవాల్

Published on: Tue Dec 24, 2013 10:03AM

 

Arvind Kejriwal rejects Delhi Police overtures, Arvind Kejriwal, Arvind Kejriwal invokes God

 

 

ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతున్న అరవింద్ కేజ్రీవాల్ నిబంధనల ప్రకారం 'జెడ్' కేటగిరీ భద్రత కల్పించాల్సి ఉంది. ఇదే విషయాన్ని తెలుపుతూ అందుకు అనుమతించాలని ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్కు ఓ లేఖ రాశారు. అయితే తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని, ఎస్కార్టు, ప్రత్యేక భద్రతాధికారి కూడా వద్దని ఆయన తిరుగు లేఖ రాశారు. 'దేవుడే నాకు అతిపెద్ద రక్షణ' అని పేర్కొన్నారు. అయితే భారీ జన సమూహాన్ని అదుపు చేయడానికి, తన వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లు చూడటానికి సాయపడితే చాలని కేజ్రీవాల్ తెలిపారు.