టీవీ ఛానళ్ల మీద కేజ్రీవాల్ కేసు
Published on: Thu Mar 3, 2016 3:04PM
.jpg)
దిల్లీలోని జేఎన్‌యూ వివాదాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో ఆది నుంచీ విద్యార్థుల పక్షాన ఉన్న కేజ్రీవాల్, వారికి అనుకూలంగా మాట్లాడే ఏ సందర్భాన్నీ వదులుకోలేదు. పైగా ఈ వివాదంలో నిందితులైన కన్నయాకుమార్, ఉమర్ ఖాలిద్‌లు దోషులు కారు అని తేల్చి చెప్పేందుకు ఒక విచారణకు సైతం ఆదేశించింది. పనిలో పనిగా, ఈ వివాదానికి సంబంధించి ప్రచారంలో ఉన్న వీడియోలలో నిజానిజాలు కూడా తేల్చమని ఆదేశించింది. ఈ విచారణలో జేఎన్‌యూకి సంబంధించిన కొన్ని వీడియోలు కల్పితాలని తేలడంతో, కేజ్రీవాల్‌కు మంచి ఆయుధం దొరికినట్లైంది. ఈ వీడియోలలో తమకు కావల్సినట్లు మార్పులు చేసిన, లేక అలా మార్పు చేసిన వీడియోలను ప్రసారం చేసిన వార్తా ఛానళ్ల మీద తగన చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీన్యూస్, టైమ్స్ నౌ వంటి వార్తా ఛానళ్ల మీద కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యల తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


