మేడమ్ టుస్సాడ్స్ లో కేజ్రీవాల్ మైనం బొమ్మ..
Published on: Sat Jan 23, 2016 3:36PM
.jpg)
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ అరుదైన ఘనతను పొందారు. అదేంటో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. బ్రిటన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ పలువురు ప్రముఖుల మైనపు బొమ్మల విగ్రహాలు తయారు చేసి ఉంచుతారు. ఇప్పటి వరకూ మహత్మ గాంధీ - ఇందిరా గాంధీ - అమితాబ్ -షారుఖ్ ఖాన్ -సల్మాన్ ఖాన్ - ఐశ్వర్య రాయ్ - కరీనా కపూర్ -మాధురీ దీక్షిత్ - హృతిక్ రోషన్ - సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ మ్యూజియంలో కేజ్రీవాల్ కూడా స్థానాన్ని ఆక్రమించేశారు. త్వరలో ఈ మ్యూజియం కేజ్రీవాల్ మైనపు బొమ్మను తయారుచేసి అక్కడ పెట్టుబోతున్నారట. దీనికి సంబంధించి మాట్లాడటానికి మేడమ్ టుస్సాడ్ ట్రస్ట్ సభ్యులు వచ్చే నెల ఢిల్లీ కూడా వస్తున్నారంట. మొత్తానికి భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమంత్రి బొమ్మను టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచడం తొలిసారి కావడం.. అది కూడా కేజ్రీవాల్ ది కావడం విశేషమే.


