TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుకేష్ చంద్రశేఖర్ లేఖలో అరుణ్ పిళ్లై పేరు!

Published on: Thu Apr 6, 2023 9:11PM

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి గురువారం (ఏప్రిల్ 6) మరో లేఖ విడుదల చేశారు. రెండు పేజీలతో కూడిన ఈ లేఖలో కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ నేతల పేర్లను ప్రస్తావించారు. గత వారం ఏపీకి 15 కోట్ల రూపాయలు ఇచ్చానని షార్ట్ నేమ్ పేర్కొన్న సుఖేశ్, ఇప్పుడు   దానికి కొనసాగింపుగా   ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని అతడికే తాను డబ్బులు ఇచ్చానని పేర్కొన్నాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనలతోనే బీఆర్ఎస్ ఆ కార్యాలయంలో పిళ్లైకి రూ.15 కోట్లు ఇచ్చానని ఆ లేఖలో పేర్కొన్నాడు.  

బీఆర్ఆర్ఎస్ కార్యాలయంలో  ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న 6060 బ్లాక్ కలర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కారులో ఈ డబ్బును ఇచ్చానని స్పష్టం చేశారు. తాను లేఖలో పేర్కొన్న అంశాలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని అవసరం అయితే నార్కో టెస్ట్ కు సైతం సిద్ధమే అని పేర్కొన్నాడు.

ఈ తాజా లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు సౌత్ గ్రూప్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే విషయాన్ని సుకేష్ చంద్రశేఖర్ లేఖ బలపరుస్తోందని అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు డొంక కదులుతోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.