బడ్జెట్‌లో మెరవని రైల్వే


 

2018-19 వార్షిక బడ్జెట్‌లో‌ రైల్వేకు 1.48 లక్షల కోట్లు కేటాయించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. బ్రిటీష్ కాలం నాటి తుప్పు పట్టిన పట్టాల స్థానంలో నూతన ట్రాక్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు జైట్లీ తెలిపారు. టిక్కెట్ల ధరలను యధాతదంగా ఉంచగా... కొత్త రైలు మార్గాల గురించి కానీ.. కొత్త రైళ్ల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

* రైల్వేలకు రూ.1.48 లక్షల కోట్లు
* రైల్వేల్లో 18 వేల కి.మీ డబ్లింగ్, రైలు పట్టాల నిర్వహణకు పెద్దపీట.
* 4 వేలకు పైగా కాపలాదారులు లేని గేట్ల తొలగింపు
* అన్ని రైల్వే జోన్‌లు, రైళ్లలో సీసీటీవీలు, వైఫై సౌకర్యం.
* పెరంబూర్‌లో అధునాతన కోచ్‌ల నిర్మాణం.
* 3,600 కి.మీ. మేర రైల్వేలైన్ల పునరుద్ధరణ.
* 600 రైల్వే స్టేషన్ల అభివృద్ధి
* అన్ని రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్లు
* వడోదరలో రైల్వే యూనివర్శిటీ