సంక్షేమ రంగంపై వరాల జల్లు

 

2018-19 బడ్జెట్‌లో సంక్షేమ రంగంపై ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ వరాల జల్లు కురిపించారు. ప్రతి పేదవాడిని బీమా పరిధిలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో పలు సంస్కరణలతో పాటు.. సరికొత్త పథకాలకు బడ్జెట్‌లో చోటు కల్పించారు. సంక్షేమ రంగానికి జైట్లీ  ఎంత కేటాయించారో ఒకసారి చూస్తే.

* ఆరోగ్య రంగానికి రూ.1.38 కోట్లు
* ప్రతీ పౌరునికి సమీపంలో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు రూ. 1200 కోట్లు
* దళిత సంక్షేమానికి రూ. 56 వేల కోట్లు. ఆదివాసీల సంక్షేమానికి రూ.32,508 కోట్లు.
* జన్‌ధన్ యోజనలో భాగంగా 60 వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు భీమా సౌకర్యం వర్తింపు.
* ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్థి.
* ఇంటింటి తాగునీటి పథకానికి రూ. 77,500 కోట్లు
* క్షయ రోగుల సంక్షేమం కోసం రూ. 600 కోట్లు.
* రూ. 330 ప్రీమియం చెల్లింపుతో 10 కోట్ల పేద కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా  50 కోట్ల మందికి లబ్థి.
* జీవన ప్రమాణాల పెరుగులకు పైలట్ ప్రాజెక్ట్ కింద 115 జిల్లాల ఎంపిక.