ఇక బ్లాక్ బోర్డు‌లు ఉండవు.. డిజిటల్ బోర్డు‌లే


 

2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను భారత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశంలో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు.. వెనుకబడిన ప్రాంతాల్లోనూ, ఆదివాసీల విద్యకు ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు జైట్లీ సభకు వివరించారు. తరతరాలుగా వస్తోన్న బ్లాక్ బోర్డు సాంప్రదాయానికి స్వస్తి పలికి.. ఆధునికతలో భాగంగా డిజిటల్‌ బోర్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు.

* విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ. లక్ష కోట్లు.
* బ్లాక్ బోర్డు నుంచి డిజిటల్‌ బోర్డు కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా డిజిటల్ విద్యా కేంద్రాలు.
* ఆదివాసీ బాలలకు ఏకలవ్య పాఠశాలలు.. వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం.
* మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక కళాశాల.. 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు.