బడ్జెట్....వ్యవసాయానికి పెద్దపీట...

 

కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ 2018-19 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఈసారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. ఈసారి రూ. 11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందచేస్తామని వెల్లడించారు. అయితే గత బడ్జెట్‌లో రూ. 10 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలను రైతులకు అందించగా.. 2018-19 బడ్జెట్‌లో రూ. లక్ష కోట్ల మేర పెంచారు. అంతేకాదు.. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సరళీకరణ చేస్తామని.. రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు...పాడి, ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామని... రైతుల కోసం జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటు... వ్యవసాయ ఉత్పత్తుల కోసం పటిష్ఠమైన క్లస్టర్ విధానం...ఆహార శుద్ధి, వాణిజ్య శాఖలతో కలసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు...సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు మరింత ప్రాధాన్యం... సేంద్రీయ వ్యవసాయం చేసేలా మహిళా సంఘాలకు ప్రోత్సాహమిస్తామని తెలిపారు. అంతేకాదు.. రైతులకు కనీసం 50 శాతం లాభాలు వచ్చేలా చూస్తామని.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమే తమ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు.