బడ్జెట్ ప్రవేశ పెట్టిన జైట్లీ...

 

2018-19 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు.  ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన లోక్‌సభలో 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠవాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ప్రధానంగా ఫోకస్ పెడతామన్నారు. ప్రపంచంలో ఏడో ఆర్దిక శక్తిగా ఉందని... త్వరలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందన్నారు. తయారీ రంగం 8 శాతం చొప్పున వృద్ధి చెందనుందని జైట్లీ తెలిపారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.. సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు మహిళా సంఘాలకు ప్రోత్సహిస్తున్నాం... రైతుల కోసం జిల్లాల్లోక్లస్టర్ల ఏర్పాటు చేస్తామని... అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి సంస్కరణల వల్ల అవినీతి తగ్గిందని, జైట్లీ తెలిపారు.