బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అరుణ్ జైట్లీ...

 

కాసేపట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన క్యాబినెట్ జైట్లీ బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలిపింది. ఇప్పటికే బడ్జెట్ ప్రతులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్లమెంట్ కు చేరాయి. ఇక 2018-19 వార్షిక బడ్జెట్ ను ఈ ఉదయం 11 గంటలకు అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.