రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ జైట్లీ...
Published on: Tue Mar 14, 2017 1:13PM

కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లి జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు జరగనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అప్పటివరకు జైట్లీయే రక్షణ శాఖ బాధ్యతలు చూసుకోనున్నారు.
కాగా గోవా సీఎంగా మనోహర్ పారికర్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన ప్రస్తుతం రక్షణ మంత్రిగా విధులు నిర్వర్తిస్తుండగా.. ఆపదవికి రాజీనామా చేశారు. దీంతో అరుణ్ జైట్లీనే రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.


