TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం.. వీర జవాన్ కు ఘన నివాళి

Published on: Sun Dec 12, 2021 9:15AM

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ భౌతికకాయం స్వగ్రామానికి చేరింది. ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరు అర్ధారాత్రికి వచ్చింది తేలుగు తేజం భౌతికకాయం. బెంగుళూరు ఎయిర్ బేస్ నుంచి తెల్లవారుజామున 5:45 గంటలకు స్వగ్రామానికి తరంచారు. కర్ణాటక సరిహద్దులో సాయితేజ మృతదేహానికి ఘన స్వాగతం పలికారు స్నేహితులు, స్థానిక యువకులు. ఊరేగింపు ముందు బైక్ ర్యాలీ ఏర్పాట్లు చేశారు. చీకిలబైలు, వేంపల్లె, చిప్పిలి, మదనపల్లె పట్టణం, అంగళ్లు మీదుగా  28 kms పొడవునా ఊరేగింపుగా స్వగ్రామం ఎగువ రేగడకు సాయితేజ మృతదేహం చేరింది. మధ్యాహ్నం సైనిక అధికార లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయి తేజ చివరి చూపుల కోసం బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. 

తమిళనాడులోని కూనురు సమీపంలో బుధవారం మధ్యహ్నం ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం చెందారు. ప్రమాదం నుంచి కెప్టెన్ వీరేందర్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలిలో లభ్యమైన మృతదేహాలను గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అందించారు. ప్రమాదంలో శరీరాలు పూర్తిగా  కాలిపోవడంతో కొన్ని మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. తెలుగు తేజం సాయితేజ మృతదేహం గుర్తింపు కూడా ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం రాత్రి సాయితేజ డెడ్ బాడీని గుర్తించారు. దీంతో అతని మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో సొంతూరు తరలించడానికి సైన్యం ఏర్పాట్లు చేసింది.