ఉభయసభలు వాయిదా
Published on: Tue Dec 10, 2013 10:50AM

పార్లమెంటు సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల అందోళనల మధ్య ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. లోక్‌సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దంటూ స్పీకర్ మీరాకుమార్ నచ్చజెప్పినప్పటికీ నేతలు తమ నిరసనలు కొనసాగించడంతో సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర ఎంపీలు నిరసనకు దిగడంతో చైర్మన్ అన్సారీ సభను గంటపాటు వాయిదా వేశారు.


