TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్, పవన్ లకు చత్వారం వచ్చిందా..?

Published on: Fri Jul 6, 2018 10:39AM

 

ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా ఏపీసీసీ కార్యాలయంలో మాజీ మంత్రులు మురళీమోహన్‌, శైలజానాథ్‌, వట్టి వసంతకుమార్‌ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్బంగా వారు ప్రత్యేకహోదాపై  చంద్రబాబు, జగన్, పవన్ తీరుపట్ల మండిపడ్డారు.. హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత వైఫల్యం చెందారో.. ప్రతిపక్ష పార్టీలుగా వైసీపీ, జనసేనలదీ అంతే తప్పుందన్నారు.. జగన్, పవన్ లకు చత్వారం వచ్చిందా?.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ఇప్పటికే విభజన హామీలన్నింటినీ నెరవేర్చేశామంటూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది..

దాన్ని చదివేందుకు వారిద్దరికీ పెద్ద భూతద్దాలేమైనా కావాలా?.. తాము లేవనెత్తినందునే ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగా ఉందని జగన్‌, పవన్‌ చెబుతున్నారు.. ఇప్పుడు, హోదాను అటకెక్కిస్తూ కేంద్రం సుప్రీంకోర్టులోనే అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇంకా ఆ అంశం సజీవంగా ఎక్కడుంది?.. హోదా, విభజన హామీల అమలు కోసం మోదీపై పోరాడాల్సిన జగన్‌, పవన్‌ ఎందుకు నోరు మెదపడం లేదు?..  రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ ఇప్పుడు మోదీకి భయపడితే.. భవిష్యత్తులో వారు ప్రజలకు సేవ చేయగలరా?..  రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాల వైఖరిని గుర్తించాలి అని ఏపీ కాంగ్రెస్ నిలదీసింది.. చూద్దాం మరి జగన్, పవన్ దీనికి బదులేమిస్తారో.