పంజాబ్ సీఎం అభ్యర్ధి కేజ్రీవాల్..

 

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అందులో పంజాబ్ కూడా ఉంది. అయితే ఇప్పటివరకూ అంతగా ఎవరూ పట్టించుకోని పంజాబ్ ఎన్నికలు ఒక్కసారిగా వేడెక్కాయి. దానికి కారణం కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా పిలుపునిచ్చారు. మొహాలీలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేజ్రీవాల్ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఎన్నికలకు ఊపు తేవాలనే అన్నారో, లేదా నిజంగానే కేజ్రీవాల్ పంజాబ్ వెళ్తారో గానీ మనీష్ సిసోదియా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.