TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీ అయ్యను చెప్పుతో కొట్టినవా కవితా.. ఎంపీ అర్వింద్ కౌంటర్

Published on: Fri Nov 18, 2022 1:34PM

నిజామాబాద్ చౌరస్తాలో తనను చెప్పుతో కొడతానంటూ తెరాస అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ దీటుగా స్పందించారు. ఖర్గేకు కవిత ఫోన్ చేసిందని చెప్పినందుకే తనను చెప్పుతో కొడతానన్న కవిత.. ఆమెతో బీజీపీ నాయకులు మాట్లాడారంటే చెప్పిన తన తండ్రిని కూడా అలా కొట్టగలరా అని ప్రశ్నించారు.

చెప్పుతో కొట్టడాలు, ఇళ్లపై దాడులు తరువాత ముందు ఖర్గేకు ఫోన్ కాల్ పై కవిత క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడాన్ని ఖండించిన అర్వింద్ ఇంట్లో ఆడవాళ్లపై కూడా దాడికి పాల్పడ్డారనీ, దాని గురించి పల్లెత్తు మాట అనని కవితపై అర్వింద్ విమర్శలు గుప్పించారు.  

 కవిత పార్టీ మారుతున్నట్లు తనకు తెలిసింది కాబట్టే మాట్లాడానని   అన్నారు. 'ఆమె తండ్రి కేసీఆర్ కూడా తన బిడ్డను పార్టీ మారాలని చెప్పారని వెల్లడించారు. మరి నీ అయ్యను కూడా చెప్పుతో కొట్టినవా అని నిలదీశారు. ముందు ఆయననుకొట్టి ఆ తరువాత తనను   కొట్టాలని అన్నారు. కవిత తనపై పోటీ చేస్తానంటే తనకు సంతోషమేననీ, దమ్ముంటే పోటీ చేయాలని సవాల్ విసిరారు.