ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్టు వారెంట్... ఉపసంహరణ
Published on: Mon Sep 22, 2014 3:22PM

విశాఖపట్టణం జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత అరెస్టుకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. చెల్లని చెక్కు ఇచ్చిన నేరం మీద ఆమెకు ఎర్రమంజిల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. విశ్వేశ్వరయ్య ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థ నుంచి రుణం తీసుకున్న కొత్తపల్లి గీత రుణాన్ని తిరిగి చెల్లించే నిమిత్తం ఆ సంస్థకు చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయింది. దాంతో సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నిమిత్తం కొత్తపల్లి గీత న్యాయస్థానానికి హాజరు కావడం లేదు. దీంతో కొత్తపల్లి గీత అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి గీత తనపైన జారీ చేసిన అరెస్టు వారెంట్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోర్టును కోరారు. దాంతో కోర్టు అరెస్టు వారెంట్ని ఉపసంహరించుకుంది.


