అక్వాఫుడ్ పార్క్ పై భారీ ఎత్తున నిరసనలు..
Published on: Wed Mar 8, 2017 10:59AM

అక్వాఫుడ్ పార్క్ పై ఎప్పటినుండో ఏపీ ప్రజలు తన నిరసనను ప్రదర్శిస్తున్న సంగతి తెలసిందే. అయితే ఈ నిరసనలు కాస్త ఉద్రిక్తమయ్యాయి. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్వాఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వచ్చి పంట కాలువలు, పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉందని.. దాదాపు 30 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా చేరుకొని భద్రతను కట్టుదిట్టం చేసి 144 సెక్షన్ ను విధించారు. అంతేకాదు పలువురు ఆందోళనకారులను సైతం అరెస్ట్ చేశారు.


