TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాయిదా పడిన ఆర్టీసీ సమ్మె

Published on: Sat Aug 2, 2014 5:35AM

 

తాము తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయించారు. ఆర్టీసీ సొంతానికి వాడుకున్న 253 కోట్ల సీసీఎస్ నిధులను వెంటనే చెల్లించాలని కొంత కాలంగా కార్మికులు ఆందోళనలకు దిగారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో శనివారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఇయు) ప్రకటించింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను సంప్రదించి సమ్మె విరమింపజేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిపించింది. ఈ నెల 20 నాటికి సీసీఎస్ నిధులను చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం రాత్రి ప్రకటించింది.