ఆర్టీసి బాదుడు

 

APSRTC Charges Hike Again, APS RTC Charges hike, RTC bus fare hike

 

 

ఆర్టీసి ఛార్జీలు పెంచేశారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. పెంచిన ఛార్జీలు మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. స్లీపర్‌ కోచ్‌లైన వెన్నెల సర్వీసులు మినహా మిగిలిన అన్ని బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై సగటున 10 శాతం మేరకు పెంపుదల జరిగింది. ఆర్డినరీ, పల్లెవెలుగు సర్వీసులకు 8 శాతం చొప్పున, లగ్జరీ సర్వీసులకు 10 శాతం చొప్పున, ఎసీ బస్‌ సర్వీ సులకు 12 శాతం చొప్పున ఛార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 4 పైసల చొప్పు న, ఎక్స్‌ప్రెస్‌ బస్‌ సర్వీసులకు 7 పైసల చొప్పున, డీలక్స్‌ బస్సులకు 9 పైసలు, సూపర్‌ లగ్జరీ బస్సులకు 11 పైసలు, ఇంద్ర బస్సులకు 12 పైసలు, గరుడ, గరుడ+ సర్వీసులకు కిలోమీటరుకు 15 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి.


వెన్నెల ఎసి స్లీపర్‌ కోచ్‌ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే సాధారణ బస్‌ పాసుల ధర కూడా పెరిగింది. సాధారణ బస్‌ పాస్‌ ధర నెలకు రూ.650 నుండి 700లకు పెరుగ గా, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో రూ.750 నుండి 800లకు, మెట్రోడీలక్స్‌ రూ.800 నుండి రూ.900లకు పెరిగింది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రోడీలక్స్‌ బస్సులకు ప్రస్తుతం ఉన్న దానికన్నా కనీస టికెట్‌ ధర మరో రూపాయి పెరిగింది. ఛార్జీల పెంపుదలతో హైదరాబాద్‌ నుండి విజయవాడకు సాధారణ బస్సుల్లో ఛార్జీ రూ.211కు, డీలక్స్‌ రూ.240, సూపర్‌ లగ్జరీ రూ.283కు పెరిగింది. 2009 నుండి ప్రతి ఏటా ఆర్టీసి ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ చివరిసారిగా 2012 సెప్టెంబర్ 24న చార్జీలు పెంచింది. ఏడాది దాటగానే మళ్లీ ప్రయాణికులపై భారం మోపింది.