ఎపిపియస్‌సికి చుక్కెదురు
Published on: Fri Dec 30, 2011 10:45AM
హైదరాబా
ద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది.గ్రూప్ వన్ రాతపరీక్షల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తెలుగు మీడియం అభ్యర్థులు ట్రిబ్యునల్‌కు వెళ్లారు.దాంతో తెలుగు మీడియం అభ్యర్థులు దాఖలు చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ గ్రూప్ వన్ పరీక్షల ఇంటర్వ్యూలను ఆపేయాలని ట్రిబ్యునల్ ఎపిపియస్‌ని అదేశించింది. దీనిపై వాదోపవాదాలు విన్న తర్వాత తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు గ్రూప్ వన్ పరీక్షల ఇంటర్వ్యూలు నిలిపేయాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు కేసును జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. జనవరి 20వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ట్రిబ్యునల్ ఎపిపియస్‌సిని ఆదేశించింది. నిజానికి, జనవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఎపిపియస్‌సి ప్రకటించింది. అయితే ఇప్పుడు అవి వాయిదా పడే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ ఆదేశాలు తమకు అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి ఇంటర్వ్యూలు నిర్వహించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎపిపియస్‌సి అధికారులు చెబుతున్నారు.


