TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్రూప్ వన్ పరీక్షల్లో గోల్‌మాల్: కవిత ఆందోళన

Published on: Mon Dec 19, 2011 12:34PM

హైదరాబాద్: ఎపిపిఎస్సీలో గోల్‌మాల్ జరిగిందంటూ టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  ఆందోళనకు దిగారు. గ్రూప్ వన్ పరీక్షల్లో గోల్‌మాల్ జరిగిందంటూ తెలుగు మీడియం విద్యార్థులు ఎపిపిఎస్సీ వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పట్ల పక్షపాతం చూపించారంటూ కార్యాలయం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వీరికి కల్వకుంట్ల కవిత మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలుగు ప్రొఫెసర్లతో దిద్దించకుండా ఇంగ్లీష్ ప్రొఫెసర్లతో దిద్దించారని విమర్శించారు. ఎపిపిఎస్సీ పూర్తిగా అవినీతిమయమైపోయిందని ఆమె ఆరోపించారు. దానిపై తమకు నమ్మకం లేదని పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిఎం సొంత జిల్లాలో ఏడు వందల మంది పరీక్ష రాస్తే వందకు పైగా సెలక్ట్ అయ్యారని, అదే వరంగల్ జిల్లాలో ఆరువందల మంది రాస్తే పదకొండు మంది మాత్రమే సెలక్ట్ అయ్యారని, దీనిపై తమకు ముఖ్యమంత్రి స్థాయిలో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు ఉన్నాయన్నారు.

 కాగా ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులు, కవితను ఎపిపిఎస్సీ కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య చర్చలకు పిలిచారు. కాగా తెలంగాణ విద్యార్థుల పట్ల సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు విమర్శించారు. విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నందుకే సిఎం వారిని టార్గెట్ చేశారన్నారు. సీమాంధ్ర అధికారులపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం ప్రకటించిన లక్ష ఉద్యోగాల్లో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలో చెప్పాలన్నారు.