TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిఠాపురంలో అపోలో హాస్పిటల్

Published on: Fri Aug 16, 2024 9:56AM

పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పవన్ కల్యాణ్ తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. తనకు భారీ మెజారిటీతో విజయాన్ని అందించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కనీవినీ ఎరుగని అభివృద్ధిని అందించి కృతజ్ణతలు తెలుపుకుంటానని ప్రకటించిన ఆయన ఆ దిశగా తొలి అడుగు వేశారు. జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  తనకు అఖండ మెజారిటీతో విజయాన్ని అందించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ అర్థవంతమైన రీతిలో కృతజ్ణతలు తెలుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పిఠాపురంకు త్వరలో అత్యంత ప్రతిష్ఠాకరమైన మల్టీ స్పెషాలిటీస్ చెయిల్ ఆస్పత్రి అపోలో హాస్పిటల్  రానున్నది.  

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామి నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవణం స్వామి నాయుడు పవన్ కల్యాణ్ వాగ్దానం చేసిన విధంగా పిఠాపురంలో అపోలో ఆస్పత్రిని ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు. ఇందు కోసం ఇప్పటికే  రామ్ చరణ్ , ఉపాసనలు పిఠాపురంలో పదెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అపోలా హాస్పిటల్ కు ఉపాసన చైర్ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో అపోలో హాస్పిటల్స్ అన్న వార్త సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. పిఠాపురం ప్రజల కోసం మల్టీ స్పెషాలటీస్ ఆస్పత్రిని తీసుకువస్తున్న పవన్ కల్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురంలో  అపోలో ఆస్పత్రికి సంబంధించిన మరింత అధికారిక సమాచారం త్వరలో  అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.  

ఎన్నికల ప్రచారంలో బాగంగా నటుడు వరుణ్ తేజ్ పిఠాపురం తమ కుటుంబానికి కొత్త సొంత ఊరు అని ప్రకటించిన సంగతి విదితమే.  అలాగే పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీ పిఠాపురాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తాయని వాగ్డానం చేశారు.  అదే విధంగా పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పిఠాపురంలో అపోలో ఆస్పత్రి ఏర్పాటు వారు చెప్పిన అభివృద్ధిలో తొలి అడుగుగా భావించవచ్చు.