సీమాంధ్ర ఎన్జీవోల చేత సమ్మె విరమించిన కిరణ్

 

 

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ అరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా సీమాంధ్ర ఎన్.జి.ఓలు సమ్మెను విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద జరిగిన చర్చల అనంతరం వారు సమ్మె విరమణకు అంగీకరించారు. అసెంబ్లీకి తీర్మానం వచ్చేదాకా తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

 

 

'రాష్ట్ర విభజన జరగదని మీరు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశముందా?' అని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కేంద్రానికి సంబంధించి హామీ ఇవ్వలేనని, తాము మాత్రం సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టంగా చెప్పారు. శాసనసభలో సమైక్య తీర్మానానికే మద్దతునిస్తానని పేర్కొన్నారు. "రాజ్యాంగంలోని 371(డి) అధికరణ మేరకు ఉద్యోగులకు రక్షణ కావాలి. ఉద్యోగుల పక్షాన కేంద్రానికి నివేదిస్తాం. 371(డి) ఉన్నంత కాలం ఉద్యోగులకు రక్షణ ఉంటుంది. దానిని తొలగించే హక్కు ఎవరికీ లేదు. దీనిపై అధిష్ఠానానికి లేఖ రాస్తాను. ఉద్యోగులకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. విభజన తీర్మానాన్ని వ్యతిరేకించడం, 371(డి)పై నా మాటలకు కట్టుబడి ఉంటాను. సమ్మె విరమించండి'' అని సీఎం కోరారు.