TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగులకు చంద్రబాబు వరాలు!

Published on: Sat Jul 12, 2014 5:23PM

 

ఏపీ ఎన్జీవోలు సత్కరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు వరాలను ప్రకటించారు. ఉద్యోగుల సమ్మె రోజులను సెలవులుగా పరిగణిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీవోలందరికీ హెల్త్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల హక్కులను కాపాడుతామన్నారు. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగులపై ఏసీబీ కేసులను సమీక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.