TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Published on: Wed Jan 28, 2026 8:38AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన బుధవారం (జనవరి 28) ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానున్న మంత్రివర్గం కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది.  వెలగపూడిలోని సచివాలయంలో జరిగే ఈ కేబినెట్ భేటీలో  రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై విస్తృత స్థాయి చర్చ జరిగే అవకాశం ఉంది.

కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు  గ్రీన్ కవర్ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. అటవీ విస్తీర్ణం విస్తరణకు సంబంధించి  అధికారులకు దిశానిర్దేశం చేయ నున్నారు.  ఆ తరువాత రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, నూతన ప్రాజెక్టులపై ఉన్నతా ధికారులతో సమీక్ష చేస్తారు.  కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న రైల్వే పనులను వేగవంతం చేసే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ  చేసే అవకాశం ఉంది.