ఆంధ్రప్రదేశ్‌కి అంతర్జాతీయ స్థాయి రాజధాని!

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు... ఆ వివరాలు...

 

1. ఆంధ్రప్రదేశ్ రాజధాని 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

 

2. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో శివరామక‌‌ృష్ణన్ కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించిన మరుసటి గంట నుంచే రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తాం.

 

3. రాజధాని నిర్మాణం కోసం మెకంజీ, ఎల్ అండ్ టీ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి.

 

4. రాజధాని నిర్మాణం కోసం మలేషియా, సింగపూర్‌లను సందర్శించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.

 

5. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అవసరమయ్యే భూమి కోసం విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరిలో (వీజీటీఎం) భూ సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

 

6. వీజీటీఎం పరిధిలో 184 కిలోమీటర్ల పొడవు వుండే అవుటర్ రింగ్‌రోడ్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 

7. వీజీటీఎం రింగ్‌రోడ్డు పరిధిలోనే 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వుంది.

 

8. రాజధాని నిర్మాణం కోసం వాటాల పద్ధతిలో భూమిని సేకరిస్తారు. రైతులు భూములు ఇచ్చినచోటే రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

9. మలేషియా పుత్రజయలా రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పుత్రజయ నగరాన్ని సందర్శించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.