ఏపీ మొదటి స్థానం.. ప్రతిపక్షాలు మౌనం

 

ఏపీలో 'అవినీతి పెరిగిపోయింది.. అభివృద్ధి జరగట్లేదు' ఇవి టీడీపీ ప్రభుత్వం మీద విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు.. అయితే వీటన్నింటికీ చంద్రబాబు మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్తున్నారు.. దానికి ఉదాహరణే ఈవోడీబీలో ఏపీ మొదటి స్థానం సాధించడం.. తాజాగా కేంద్రం ప్రకటించిన సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో 98.42 శాతంతో మొదటి స్థానంలో ఏపీ నిలవగా, 98.33 శాతంతో రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది.. గత ఏడాది ఏపీ, తెలంగాణ రెండూ సమానమైన మార్కులతో మొదటి స్థానాన్ని పంచుకోగా, ఈ ఏడాది ఏపీ ఒకడుగు ముందుకేసి సోలోగా మొదటిస్థానంలో నిలిచింది.. దీంతో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం ఏపీ అని సాధికారికంగా స్పష్టమైంది.. మరి ఏపీలో అవినీతి పెరిగిపోయింది, అభివృద్ధి జరగట్లేదని చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్న జగన్, పవన్ మరియు బీజేపీ నేతలు.. ఏపీ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మొదటి స్థానంలో నిలవడంపై ఎలా స్పందిస్తారో చూడాలి.. స్పందించడం ఏమో కానీ తెలుగు పత్రికలు మొదటి పేజీలో గర్వంగా ప్రచురించాల్సిన ఈ విషయాన్నీ, ప్రతిపక్షనేత పత్రికలో మాత్రం రెండో పేజీలో చిన్న బాక్స్ లో సరిపెట్టేసారు.. ఎవరి వల్ల అయితే ఏంటి.. రాష్ట్రానికి మంచి జరిగితే ఒక నాయకుడిగా ఆనందపడాలిగా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.