వైసీపీ ఎంపీల రాజీనామాలు లేటుగా ఆమోదించడానికి కారణం
Published on: Thu Jun 7, 2018 10:15AM

ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం.. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ రాజీనామాలు ఆమోదించకుండా పక్కనపెట్టడం తెలిసిందే.. అయితే బీజేపీ, వైసీపీ కలిసి నాటకం ఆడుతూ ప్రజల్ని మభ్యబెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు రావడంతో.. ఎట్టకేలకు స్పీకర్ రాజీనామాలు ఆమోదించారు.. కానీ ఇలా లేటుగా ఆమోదించడం వెనక బలమైన కారణం ఉందట.. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏడాది కన్నా తక్కువ కాలపరిమితున్న ఎంపీ సీట్లకు ఎన్నికలు నిర్వహించరు.. అందుకే బీజేపీ, రాజీనామాల ఆమోదాన్ని లేట్ చేసిందట.. ఒకవేళ ముందే ఆమోదిస్తే.. ఉపఎన్నికల్లో టీడీపీ సత్తా చాటితే, చంద్రబాబు ఇమేజ్ బాగా పెరిగిపోతుంది.. అది 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్లస్ అవుతుంది.. ఇవన్నీ ఆలోచించిన బీజేపీ కావాలనే వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదం లేట్ చేసిందట.. క్యా ప్లాన్ హై...


