TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రతి సభలో ఓ పావుగంట... కాంగ్రెస్‌పై కసిని పెంచుతున్న చంద్రబాబు

Published on: Mon Jun 5, 2017 2:52PM

కాంగ్రెస్‌పై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. రాహుల్‌ సభతో ప్రత్యేక హోదాపై వేడి రగల్చడంతో తన నోటికి పనిచేబుతున్నారు. ప్రతి సభలోనూ కనీసం ఓ పావుగంట.... కాంగ్రెస్‌పై విమర్శలకు కేటాయిస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారిపై జాలిపడొద్దనీ, అలాగని విధ్వంసాలకు పాల్పడవద్దంటూ ప్రజలకు చంద్రబాబు సీఎం హోదాలో పిలుపునివ్వడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌‌గా మారింది.

 

కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరిగితే నాడు పెద్దలు ఎలా మౌనంగా ఉన్నారో ....రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పెద్దలు అలానే మౌనంగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాడు అధికారంలో ఉండి అన్యాయం చేసిన వాళ్లే ...మళ్లీ రాష్ట్రంపై కపట ప్రేమను కురిపిస్తున్నారని రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ క్షమించరాని నేరం చేసిందనీ, వైసీపీ కూడా అందులో కుట్రదారేనని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిపై జాలిపడొద్దనీ, అలా అని విధ్వంసాలకు పాల్పడవద్దని ప్రజలకు బాబు పిలుపునిచ్చారు.

 

మొత్తంగా నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రతిరోజూ జరుగుతున్న సభల్లో కాంగ్రెస్ విభజన చేసిన తీరును గుర్తు చేస్తూ ప్రజల్లో కసి పెంచే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.