మనసు మార్చుకున్న టీఆర్ఎస్... అవిశ్వాసంపై చర్చకు సహకరిస్తాం..

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే తీర్మానం పెట్టారు.... కానీ అది మాత్రం చర్చకు రాలేదు. దీనికి కారణం టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు కూడా కారణం అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తమ రాష్ట్రానికి రిజర్వేషన్ల కేటాయింపు పెంచాలని టీఆర్ఎస్ పోరాడుతుంటే... మరోవైపు.. అన్నాడీఎంకే పార్టీ కావేరి నది జల వివాదంపై పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టిన టీడీపీ, వైఎస్సార్ సీపీలతో పాటు... కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తీర్మానం పెట్టింది. ఆతరువాత.. సీపీఎం, ఆర్ఎస్పీ కూడా తీర్మానాలు ఇచ్చాయి. ఇక టీడీపీ ఎంపీ కేసీనేని నాని కూడా సొంతంగా మరో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. దీంతో...ఇన్ని రోజులు అవిశ్వాస తీర్మానాకి అడ్డు తగులుతూ వచ్చిన టీఆర్ఎస్ కూడా తన వైఖరిని మార్చుకుంది. అవిశ్వాసంపై చర్చకు తాము సహకరిస్తామని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించారు.