TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలనం! ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు లింక్

Published on: Wed Feb 3, 2021 4:21PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు మరింత పెంచారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంటూనే ఏపీ సర్కార్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు నిమ్మగడ్డ. ఎస్ఈసీకి సరిగా సహకరించని అధికారులపై వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ కు లేఖ రాశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.  ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు లింక్ పెట్టాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఏకగ్రీవమైన మండలాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఎస్ఈసీ తాజా  లేఖతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. దీనిపై సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే అధికారుల బదిలీల విషయంలో ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య వార్ జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీతో పాటు తొమ్మిది మంది అధికారులను బదిలీ చేశారు నిమ్మగడ్డ. ఆ తర్వాత పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్ ను బదిలీ చేసినట్లే చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అనంతరం వారిపై అభిశంసన నోటీసులు జారీ చేశారు.  వీఆర్ఎస్ ప్రతిపాదనలతో కేంద్ర సిబ్బంది వ్యవహారాళ శాఖకు లేఖ రాశారు.  ఐతే వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తాను చేసిన అభిశంసన ప్రతిపాదనలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.