TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిర్మలమ్మ బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు

Published on: Tue Jul 23, 2024 12:17PM

దాదాపు ఏడేళ్ల తరువాత దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి అన్న విషయాన్ని కేంద్రం గ్రహించినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (జులై 23) లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించారు.

 అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం సత్వర పూర్తికి నిధులు కేటాయించారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం కింద నిధులు కేటాయించారు. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని విస్పష్ట ప్రకటన చేశారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం వింటుంటే.. చంద్రబాబు హస్తిన పర్యటన ఫలప్రదం అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.