సరికొత్త సర్వే ఫలితాలు: అగ్రస్థానంలో తెలుగుదేశం

 

 

 

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే ఎంతో కీలకమైన ఎన్నికలుగా నిలిచే అవకాశాలున్నాయి. 2014 ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నప్పటికీ ఆ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతాయోనన్న ఉత్కంఠ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశమంతటా వుంది. ఎన్నికల ఫలితాల మీద సర్వేలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలను నిర్వహించడంలో విశ్వసనీయత వున్న ఒక సంస్థ, మరో ప్రముఖ సంస్థతో కలసి రాష్ట్రంలో ఒక సర్వే నిర్వహించినట్టు తెలిసింది.

 

ఆ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఒక తెలుగు ఛానల్‌లో రేపో ఎల్లుండో ప్రసారం కానున్నాయి. ఆ సర్వేకి సంబంధించిన వివరాలు ‘తెలుగువన్’ చేతికి చిక్కాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని ఏయే పార్టీ ఎన్ని స్థానాలను గెలిచే అవకాశం వున్నదో ఆ సర్వే చెబుతోంది.



ఆ సర్వే ప్రకారం... రాష్ట్రంలోని 294 అసెంబ్లీ సీట్లలో 117 సీట్లలో గెలిచి తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలుస్తుంది. రాష్ట్రంలోని మిగతా పార్టీల విషయానికి వస్తే,  వైఎస్సార్సీపీ-87, టీఆర్ఎస్-51, కాంగ్రెస్ పార్టీ-25, బీజేపీ-02, ఎం.ఐ.ఎం.-07, ఇతరులు-05 సీట్లలో గెలిచే అవకాశం వుందని ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.