కావూరికే చంద్రబాబు సత్తా తెలుసొచ్చిందన్న మాట..!

 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా...? లేక సింగిల్ గానే టీడీపీ రంగంలోకి దిగుతుందా...? ఈ ప్రశ్నలకు ఇప్పుడప్పుడే సరైన సమాధానం తెలియదు మనకి. ఎందుకంటే ప్రస్తుతం రెండు పార్టీలు మిత్రపక్షంగా ఉన్నా... రెండు పార్టీల మధ్య విబేధాలు ఉన్న సంగతి బహిర్గత విషయమే. ఇక ఇటీవల ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.  కానీ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ పొత్తు డౌట్ గానే ఉంది. అయితే మరోపక్క మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకోకూడదు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళాలి అంటూ బీజేపీ పెద్దలు కొంతమంది ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కానీ దీనిపై కొంతమంది పెద్దలు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పొత్తు తప్పకుండా పెట్టుకోవాల్సిందే లేకపోతే ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదంటూ మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబ‌శివ‌రావు వంటి నాయకులు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. అంతేకాదు వైసీపీ తో కనుక పొత్తు పెట్టుకుంటే తోక పట్టుకుని గోదారి ఈదినట్టే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారట. దీంతో నిన్న మొన్నటి వరకూ ఏ పార్టీ పై నిప్పులు చెరిగారో... ఇప్పుడు అదే పార్టీ గతి అయింది. మొత్తానికి కావూరి లాంటి వాళ్లకే చంద్రబాబు సత్తా తెలిసినట్టుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.