ఏపీలో పంచాయితీ ఎన్నికలు స్టార్ట్..
Published on: Tue Feb 9, 2021 9:14AM
ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతున్నాయి.12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో
ఈ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి.. ఈ ఎన్నికల్లో 7,506 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. తొలిదశ ఎన్నికల కోసం 29,732 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 525 పంచాయతీలు, 12,185 వార్డులు ఏకగ్రీవం కాగా.. పంచాయతీ ఎన్నికల్లో ఈ సారి నోటాకు అవకాశం ఉందని.. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.


