ఇంతకూ దొనకొండను ఏం చేయబోతున్నారు?

 

 

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే రాజధానిని మార్చవచ్చని ఎన్నికల సమయంలో చర్చ జరిగింది.  అలాగే తాజాగా అమరావతి పై మంత్రి బొత్స వ్యాఖ్యలతో మళ్ళీ ఇదే అంశం పై చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో రాజధానిని దొనకొండకు మార్చే అవకాశం ఉందని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. అక్కడ భూములు కొనేందుకు రాజకీయ నాయకులు పరుగులు పెడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే రాష్ట్ర ప్రభుత్వం నుండి రాజధాని మార్పుకు సంబంధించి ఇప్పటివరకు  ఎటువంటి వివరణ రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దొనకొండను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండడం అలాగే కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన రామాయపట్నం పోర్ట్ దీనికి దగ్గర కావడంతో ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు  తెలుస్తోంది.