బ్రేకింగ్.. కొత్త సీఎస్ గా సమీర్ శర్మ..
Published on: Fri Sep 10, 2021 11:26AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ నియమితులయ్యారు. సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన ప్రధాన కార్యదర్శగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1985 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ.. ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. న్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ గవర్నెన్స్ సంస్థ (ఐఎల్ఈజీ) వైస్ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈనెల 30వ తేదీతో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే మూడు నెలల ఎక్స్ టెన్షన్లో ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు.


