అసలే కష్టాలలో ఉన్నాం.. ఇపుడు అమరావతి గోల అవసరమా: ఎపి మంత్రి

 

 

నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లతో రాజధాని ని అమరావతి నుండి మార్చే అవకాశాలు ఉన్నాయంటూ తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతుంటే, మీడియా  బొత్స వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. ఐతే తాజాగా ఈ విషయం పై టీడీపీ చేస్తున్న విమర్శలను మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు . రాజధాని అమరావతిపై ఫైనల్ నిర్ణయం సీఎం జగన్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అలాగే రాజధానిని మార్చేస్తామని మంత్రి బొత్స ఎక్కడా వ్యాఖ్యానించలేదని అయన అన్నారు. తాజాగా కృష్ణా నదికి వచ్చిన వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఇలాంటి సమయంలో రాజధాని పై చర్చ అవసరమా అంటూ చెప్పుకొచ్చారు. అసలే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఇటువంటి సమయంలో మళ్లీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం మంచి పద్దతి కాదని అవంతి శ్రీనివాస్ అన్నారు. గడచిన ఐదేళ్లలో తాత్కాలిక సెక్రటేరియంట్, తాత్కాలిక అసెంబ్లీ తప్ప రాజధానిలో ఇంకేమైనా కట్టారా అంటూ తెలుగుదేశంపై మంత్రి మండిపడ్డారు. అసలు రాజధానిలో టీడీపీ కట్టింది ఏమిటో తమ ప్రభుకిత్వం ఆపేసింది ఏమిటో చెప్పాలని అయన టీడీపీ నేతలను ప్రశ్నించారు.