మద్యం కుంభకోణం దర్యాప్తు వేగం: జగన్ లో పెరుగుతున్న భయం.. కేంద్ర పెద్దలను శరణు జొచ్చే ప్రయత్నం.?
Published on: Thu Sep 24, 2026 6:04PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు జగన్ మెడకు చుట్టుకుంటోందా? ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు, విచారణలో జగన్ సన్నిహితులు వెల్లడిస్తున్న వివరాల మేరకు ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే అన్న అనుమానాలు పెంచేవిగానే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఈడీ దర్యాప్తు ఏ క్షణంలోనైనా తాడేపల్లి ప్యాలెస్ తలుపుతట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆయనలో భయాన్నీ, కంగారునూ ఎత్తి చూపుతోందని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి ఆయన డిస్పరేట్ గా దారులు వెతుక్కుంటున్నట్లు కనిపిస్తోందంటున్నారు. డీఎస్సీ అవకతవకల పేర నిరుద్యోగులను రెచ్చగొట్టి మద్యం కుంభకోణంలో వెలుగులోకి వస్తున్న వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నంగానే పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాకుండా రాజ్ భవన్‌కు పరుగులెత్తి గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించడం వంటివి ఆయనలోని భయాన్నీ కంగారునూ ఎత్తి చూపుతున్నాయంటున్నారు.
.webp)
జగన్ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో సిట్, ఈడీలు ఏకకాలంగా ేస్తున్న దర్యాప్తు ఈ కుంభకోణం మూలల వద్దకు వేగంగా చేరుతంది. ముఖ్యంగా ఈడీ దర్యాప్తు వేగం..ఈ కుంభకోణలో మనీ ట్రయల్ చిక్కుముడులను విప్పుతోంది. ఈ వ్యవహారంలో దాదాపుగా ఈడీ దర్యాప్తు కొలిక్కి వచ్చేసినట్లేని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారులు తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టడం ఇంకెంతో దూరంలో లేదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ముందుగా మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆరథిక వ్యవహారాలను చక్కబెట్టిన, జగన్‌కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు అయిన అనిల్ రెడ్డి పాత్రపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ముడుపుల సేకరణ, వాటిని హవాలా మార్గాల్లోకి మళ్లించడం వెనుక కీలక సూత్రధారిగా భావిస్తున్న అనిల్ రెడ్డిని ఈడీ ఏ క్షణంలోనైనా విచారణకు పిలవడమో, అదుపులోకి తీసుకోవడమో జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్వీయరక్షణ కోసం జగన్ దూకుడు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రం చేశారంటున్నారు.
అదే సమయంలో కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇక ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి పరిమళ్ నత్వానీ ద్వారా కేంద్ర పెద్దలను శరణు జొచ్చే ప్రయత్నాలు జగన్ మ ముమ్మరం చేశారంటున్నారు. పరిమళ్ నత్వానీ ఎందుకంటే.. జగన్ హయాంలో పరిమళ్ నత్వానీని రాజ్యసభకు ఎంపిక చేశారు. అందుకే ఇటీవల బెంగళూరులో జగన్ ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు.
[AP Liquor Scam, YS Jagan Mohan Reddy, Enforcement Directorate, Andhra Pradesh Politics, YCP Tenure, Telugu One]


