TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి... ఎందుకంటే?

Published on: Mon Oct 6, 2025 9:33PM

 

ఏపీ లిక్కర్ స్కామ్‌లో  బెయిల్ పొందిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితి  సమావేశాలకు వెళ్లే భారత పార్లమెంట్ సభ్యుల బృందంలో మిథున్ రెడ్డికీ అవకాశం లభించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన తన పాస్‌పోర్టు విడుదల కోసం కోర్టును ఆశ్రయించారు.

ఐక్యరాజ్య సమాఖ్య జనరల్ అసెంబ్లీ  80వ సెషన్ అక్టోబర్ 27 నుంచి న్యూయార్క్‌లో ప్రారంభమవనుంది. ఈ సమావేశానికి భారత్ తరపున మొత్తం 16 మంది ఎంపీలు హాజరుకానున్నారు. వీరిలో తెలుగు దేశం పార్టీ నుంచి ఎవరూ లేరు, కానీ వైసీపీకి చెందిన మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు.

ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పురందేశ్వరి ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. అందుకే మరో ఎంపీకి అవకాశం ఇవ్వలేదని సమాచారం. UNGA సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమవుతాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ సెప్టెంబర్ 27న ప్రధాన ప్రసంగం చేస్తారు.

అక్టోబర్ 27 నుంచి జరిగే పార్లమెంటరియన్ల స్పెషల్ డెలిగేషన్‌లో మిథున్ రెడ్డి కూడా ఉంటారు. ఈ బృందం పోస్ట్-హై లెవల్ ఈవెంట్స్‌, సైడ్‌లైన్ మీటింగ్స్‌, దౌత్య చర్చల్లో పాల్గొంటుంది. ఇదే సమయంలో, మిథున్ రెడ్డి తన పాస్‌పోర్టు విడుదల కోసం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు